Saturday, June 13, 2026
Homeసినిమాఅక్టోబర్ 29న వస్తోన్న ‘తీరం’

అక్టోబర్ 29న వస్తోన్న ‘తీరం’

అకి క్రియేటివ్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోహీరోయిన్లుగా  యం .శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘తీరం’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 29న అత్యధిక ధియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్బంగా హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా నిర్మాత శ్రీనివాసులు గారు కథని నమ్మి నా మీద నమ్మకంతో నిర్మించారు. సినిమా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 29న మా చిత్రం విడుదలవుతుంది. తప్పకుండా ‘తీరం’ సినిమాని చూసి సక్సెస్ చేయాలి అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ “తీరంలో మెయిన్ హీరోగా చేశాను.. అనిల్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు.. సినిమా యూత్ ఆడియెన్స్ కె  కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది..ఒక మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

చిత్ర నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ” కొత్త వారైనా కూడా తీరం చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. సెన్సార్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి.. మా సినిమాని అక్టోబర్ 29న  సినేటెరియా సంస్థ ద్వారా వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారు. సినిమాని ఆదరించి పెద్ద విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular