Friday, June 12, 2026
HomeTrending Newsవ్యాక్సిన్ లో ఏపీ రికార్డు : జగన్ అభినందన

వ్యాక్సిన్ లో ఏపీ రికార్డు : జగన్ అభినందన

వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధించింది. నిన్న ఒక్కరోజే 13 లక్షల 68 వేల 49 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మరోసారి తన సత్తా దేశానికి చాటింది. సోమవారం కోవిడ్ పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు, వైద్య సిబ్బందికి, ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. గ్రామ, వార్డు, వాలంటీర్లు, ఏ ఎన్ ఏం లు, ఆశా వర్కర్లు, డాక్టర్లు అలుపెరగకుండా కోవిడ్ నియంత్రణకు పాటు పటుడున్నారని సిఎం కితాబిచ్చారు.

జిల్లాల వారీగా వ్యాక్సిన్ వివరాలు పరిసీలిస్తే.. శ్రీకాకుళం: 88,562; విజయనగరం: 64,683; విశాఖ: 1,11,863; తూర్పు గోదావరి: 1,55,556; పశ్చిమ గోదావరి: 1, 65, 939; కృష్ణా: 1,41, 444; గుంటూరు: 1,06, 790; ప్రకాశం: 1,04, 439; నెల్లూరు: 79, 146; చిత్తూరు: 1,02,862; అనంతపురం: 88, 622; కడప: 78,971; కర్నూలు: 79,172 డోసులు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular