Wednesday, March 26, 2025
HomeTrending Newsవిశ్వ వేదికపై తెలుగు పతాక: సిఎం జగన్ హర్షం

విశ్వ వేదికపై తెలుగు పతాక: సిఎం జగన్ హర్షం

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని  నాటు నాటు పాటకు ఆస్కార్ లభించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జానపద రీతులకు, నాగరికతకు లభించిన గుర్తింపుగా దీన్ని భావిస్తున్నానని,  ఎంతో గర్విస్తున్నానని సిఎం తన సందేశంలో పేర్కొన్నారు.  రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సినిమా ద్వారా చరిత్రను తిరగ రాశారని అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన చంద్రబోస్, ప్రేమ రక్షిత్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ తో పాలు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అయన అభినందనలు తెలియజేశారు.  తనతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను, భారతీయులను గర్వపడేలా చేశారని సిఎం జగన్ అభివర్ణించారు.\

Also Read : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: RRR కు అవార్డుపై పవన్ హర్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్