Sunday, February 23, 2025
HomeTrending Newsఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

ఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ఐసిఎంఆర్ బృందం ఈరోజు లేదా రేపు కృష్ణపట్నవెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.

కోవిడ్ పై తన క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆనందయ్య మందుపై చర్చ వచ్చింది. ఈ మందు తీసుకున్న వారిలో ఆక్సిజన్ శాతం పెరిగిందని కొందరు పేషెంట్లు స్వయంగా చెప్పిన విషయాలను కొందరు అధికారులు సిఎం దృష్టి కి తీసుకు వచ్చారు.

ఆయుర్వేద మందు కోసం కృష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరుకు వేలాదిమంది చేరుకుంటున్నారు. దీంతో కృష్ణపట్నం పరిసర ప్రాంతాలు వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు. తొక్కిసలాట జరిగి కాసేపు మందు పంపిణి ఆపేశారు.

కోవిడ్ నియంత్రణ, వాక్సిన్ పై కూడా సిఎం సమీక్షించారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యున్నత ప్రమానాలున్న ఆక్సిజన్ సరఫరా పైపులు, మాస్క్ లు వినియోగించాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఆస్పత్రి నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.  అధిక ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులు, రేమిడేసివిర్ బ్లాక్ మార్కెట్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్