Saturday, November 23, 2024
HomeTrending Newsసాఫ్ట్ స్కిల్స్ లో సరికొత్త అధ్యాయం: జగన్

సాఫ్ట్ స్కిల్స్ లో సరికొత్త అధ్యాయం: జగన్

రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ అందిస్తున్నామని, విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను భూతద్దంలో పెట్టి మరీ చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే భవిష్యత్ లేదని గుర్తించి ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల బోధన మొదలు పెట్టామని, అమ్మ ఒడి, నాడు-నేడు, విద్యా కానుక, జగనన్న గోరు ముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

చదువుకున్న డిగ్రీకి ఉద్యోగం లభించేలా కరికులమ్ లో కూడా మార్పులు తీసుకు వచ్చామన్నారు.  విశాఖలో పర్యటించిన సిఎం జగన్ ఆంధ్రా యూనివర్సిటీ స్నాతకోత్సవ మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో నగరంలోని మైక్రోసాఫ్ట్ ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన విద్యార్ధులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ అందిస్తున్నామని, దాదాపు 40 విభాగాల్లో వివిధ కోర్సులకు గాను 1.62లక్షల మంది శిక్షణ ఇస్తోందని, దీనికి గాను ప్రభుత్వం 32కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారందరినీ మైక్రోసాఫ్ట్ టెక్నికల్ అసోసియేట్స్ గా పిలుస్తారని  వివరించారు.  ఇప్పటికే 35, 980 మంది విద్యార్ధులు శిక్షణ పూర్తి చేసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే ఒక శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. నేడు సర్టిఫికేట్ అందుకుంటున్న 36 వేల మంది విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ సాఫ్ట్ స్కిల్స్ లో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది పలికామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్