Friday, June 12, 2026
HomeTrending Newsతెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు

తెలంగాణలో 25 రాష్ట్రాల రైతు నేతలు

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి బయలుదేరిన రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. వారు క్షేత్ర స్థాయి పర్యటనకు బయలు దేరే ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా అమలు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించడానికి మేం తెలంగాణకు వచ్చామని తెలిపారు. ఈ పరిశీలన ద్వారా మా రాష్ట్రాల్లో కూడా తెలంగాణ అమలుచేస్తున్న రైతు సంక్షేమ వ్యవసాయ అభివృద్ధి విధానాల అమలుకు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకూ ఉంటే బాగుండేదన్నారు. నష్టాలు లేకుండా తెలంగాణా రైతులు వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా కొనసాగించడం మాకెంతో ఆశ్చర్యం అనిపించిందన్నారు.

ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు హిమాంశ్ మాట్లాడుతూ … సీఎం కేసీఆర్ ఎకరానికి 10 వేల రూపాయల రైతుబంధు సాయం, 5 లక్షల రూపాయల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామమన్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు, సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు.. దేశానికే రైతు బాంధవుడు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, కర్ణాటక తదితర 25 రాష్ట్రాలకు చెందిన రైతులు దాదాపు 100 మంది పాల్గొన్నారు. వారు తెలంగాణ వ్యవసాయం, సాగునీటి రంగ అభివృద్ధినీ పరిశీలించేందుకు, క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వ్యవసాయ అభివృద్ధి విధానాల అమలుకు తమ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని, రైతులు వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా కొనసాగించడం హర్షనీయమన్నారు. ఎకరానికి 10 వేల రూపాయల రైతుబంధు సాయం, 5 లక్షల రూపాయల రైతు బీమా సాయం దేశ రైతు చరిత్రలోనే గొప్ప పరిణామమని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular