Saturday, June 13, 2026
HomeTrending Newsవాణి జయరాం మృతిపై సీఎం దిగ్భ్రాంతి

వాణి జయరాం మృతిపై సీఎం దిగ్భ్రాంతి

సుప్రసిద్ధ గాయని వాణి జయరాం మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.
తన గాత్ర మాధుర్యంతో సినీ, శాస్త్రీయ సంగీతానికి ఆమె అందించిన సేవలు అమూల్యమైనవని తన సందేశంలో పేర్కొన్నారు.
శాస్త్రీయ సంగీతంలో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొని తన సుమధుర గాత్రంతో లక్షలాది శ్రోతలను ఆమె పరవశింప జేశారని కొనియాడారు. వాణి జయరాం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సీఎం జగన్ వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular