Sunday, January 19, 2025
HomeTrending Newsసిఎం పెన్నుపై బుడ్డోడి కన్ను

సిఎం పెన్నుపై బుడ్డోడి కన్ను

A Gift: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనలో ఓ విచిత్ర సంఘటన జరిగింది.  పి.గన్నవరం మండలం  గంటి పెదపూడి లంకలో  బాధితులను పరామర్శిస్తున్నసమయంలో సిఎం ఓ బాలుణ్ణి ఆప్యాయంగా ఎత్తుకున్నారు. ఆ బాలుడు సిఎం జేబులోని  మౌంట్ బ్లాంక్  పెన్నును తన చేత్తో తీసుకున్నాడు. సిఎం ఆ బాలుడితో పెన్ను కావాలా అని అడిగారు, ఆ బాలుడు తల ఊపడంతో సిఎం ఆ పెన్నును బాలుడికి గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఈ ఆసక్తికర సంఘటన అందరినీ ఆకర్షించింది.

తన కుమారుడిని ఐ ఏ ఎస్ చేస్తానని, ఆ తర్వాత జగన్ ను కలిసి ఈరోజు సంఘటనను గుర్తు చేస్తానని ఆ బాలుడి తల్లి వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్