Oxygen Plant: మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది. సిఎం ఆలోచనలకు అనుగుణంగా శ్రీసిటీ ఎస్ఈజడ్ లో నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆక్సిజన్ ప్లాంట్‌ను నెలకొల్పింది. ఈ ప్లాంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్‌కు లోటులేకుండా చూసే చర్యల్లో భాగంగా, రోజుకు 220 టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
కోవిడ్ రెండో దశలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన సందర్భంలో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ తయారీ కంపెనీ ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా నోవా కంపెనీతో జనవరి 24, 2020న ఏపీ ప్రభుత్వం ఏంఓయూ కుదుర్చుకోగా డిసెంబర్ 18, 2020న పనులు ప్రారంభించి 14 నెలల్లో ప్లాంట్ ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లో మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గోన్ వాయువుల తయారీ జరగనుంది.
ఈ కార్యక్రమంలో సిఎం క్యాంపు కార్యాలయం నుంచి నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ గజనన్ నబర్, కమర్షియల్ హెడ్ శరద్ మధోక్, శ్రీసిటీ జీఎం (కార్పొరేట్ ఎఫైర్స్) సీహెచ్.రవికృష్ణ పాల్గొనగా, శ్రీసిటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్, శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : సచివాలయాల్లో పోస్టుల భర్తీ: సిఎం