Tuesday, March 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సచివాలయాల్లో పోస్టుల భర్తీ: సిఎం

సచివాలయాల్లో పోస్టుల భర్తీ: సిఎం

Grama Swarajyam: మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా ప్రభుత్వం సేవలు అందించేందుకే ‘ఏపీ సేవ’ పోర్టల్ ను మొదలు పెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సిటిజెన్ సర్వీస్ పోర్టల్ 2.O ను సిఎం జగన్  లాంఛనంగా ప్రారంభించారు. రెండున్నరేళ్లుగా గ్రామ స్వరాజ్యానికి అసలైన అడుగులు వేస్తూ పాలన సాగిస్తున్నమన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ద్వారా 540 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి 2 మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని, ద్వారా  లక్షా 34 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి  50 ఇళ్ళకు ఒక వాలంటీర్ చొప్పున 2 లక్షల 60 వేలమంది గ్రామ/వార్డు స్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. మొత్తం 4 లక్షల మంది డెలివరీ మెకానిజం లో పనిచేస్తున్నారని వివరించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టాలని సిఎం జగన్ సూచించారు.  సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమం తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం సూచనలు:

⦿ ఆధార్‌ సేవలను అందించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయండి
⦿ మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి రావాలి
⦿ ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు
⦿ ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్స్‌ ఇవ్వాలి


⦿ హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి
⦿ ప్రతినెలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించాలి
⦿ అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి
⦿ ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే… గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు చూపాలి
⦿ ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో నిరంతరం వారికి అవగాహన కల్పించాలి
⦿ నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలి
⦿ ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశం
⦿ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తికావాలి
⦿ సేవలకోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థఉండాలి
⦿ దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందుపరచాలి
⦿ సిఎం పోర్టల్‌లో ఈమేరకు మార్పులు చేర్పులు చేయాలి
⦿ సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగాలి
⦿ దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి
⦿ సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాలమధ్య నిరంతరం సమన్వయం ఉండాలి
⦿ దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, రెవిన్యూ డివిజన్‌స్థాయిలో, జిల్లాల స్థాయిలో సమన్వయ
సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి
⦿ సచివాలయాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఎంఏఅండ్‌యూడీ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, సీఎం సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్‌.ధనుంజయ్‌ రెడ్డి, జీఎస్‌డబ్యూఎస్‌ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే,  విఎస్‌డబ్యూఎస్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ షన్‌ మోహన్, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్