Thursday, March 28, 2024
Homeసినిమా‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి స్పెషల్ పోస్టర్

‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి స్పెషల్ పోస్టర్

On Duty: మాస్ మహారాజా రవితేజ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ఈ మూవీ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది.

ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో రవితేజ విభిన్న ఎమోషన్స్లో కనిపిస్తున్నారు. ఒక చోట ఫ్యామిలీతో కనిపిస్తుండగా..మరో చోట ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నట్టు.. ఇంకోదాంట్లో యాక్షన్లోకి దిగేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరో ఫోటోలో ట్రైన్ మంటల్లో కాలిపోతోండటం కూడా కనిపిస్తోంది. మొత్తానికి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్