Thursday, April 25, 2024
HomeTrending Newsసిఎం జగన్ లండన్ టూర్ మిస్టరీ...యనమల విమర్శ

సిఎం జగన్ లండన్ టూర్ మిస్టరీ…యనమల విమర్శ

సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ ల్యాండింగ్ వెనుక మిస్టరీ ఏమిటి..? 3ఏళ్ల తర్వాత దావోస్ వెళ్లడం రాష్ట్రం కోసమా, తన కోసమా..? తెలుగుదేశం పార్టీ సీనియర్ యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.  అక్రమార్జన నల్లధనం తరలింపు కోసమా..? అన్నారు. దండుకున్న సంపద దాచుకోడానికే లండన్ లో ల్యాండింగా అనే అనుమానం ప్రజల్లో ప్రబలంగా ఉంది.
అధికారికంగానే జగన్ లండన్ వెళ్లవచ్చు కదా..? చాటుమాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి..? అని ప్రశ్నించారు. అధికారులను వదిలేసి లండన్ ముగ్గురే(భార్య, మరొకరు) వెళ్లడం లోగుట్టు ఏమిటి..? మీ సొంత పనులకు, సీక్రెట్ పనులకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా..?అన్నారు. ఏ దేశ పర్యటనకు సిబిఐ కోర్టును అనుమతి కోరారు..ఏ దేశానికి వెళ్లేందుకు కోర్టు అనుమతిచ్చింది..? లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఉందా..? దావోస్ కు వెళ్లడానికి మాత్రమే అనుమతించిందా..?

14కేసులలో ముద్దాయిగా వున్న ఏ1 నిందితుడైన చరిత్ర జగన్ ది. ఆయన గత చరిత్ర దృష్ట్యా ప్రజల్లో మరిన్ని అనుమానాలు రేకెత్తడం సహజమే. ఏ దేశం వెళ్లడానికి మీరు దరఖాస్తు చేశారు..? మీకు ఏ దేశానికి అనుమతి ఇచ్చారు, మీరు ఏ దేశానికి వెళ్లారు..? లండన్ కు అనుమతిస్తే అధికార పర్యటనలో ఎందుకు చేర్చలేదు..? షెడ్యూల్ లో లేని లండన్ లో ఎందుకు ల్యాండ్ అయ్యారు..? అనుమతి ఇవ్వకపోయినా లండన్ వెళ్లడం కోర్టు ధిక్కరణ కాదా..? అని యనమల ప్రశ్నించారు. Permitting petitioner/A1 to visit Switzerland for the period from 19.05.2002 to 31.05.2022 to attend World Economic Forum Annual Meeting అని సిబిఐ కోర్టు ఆదేశాల్లో ఉన్నది వాస్తవం కాదా..? ఇలా కోర్టు అనుమతితో విదేశీ పర్యటనలకు వెళ్లే పరిస్థితి దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా గతంలో వచ్చిందా..? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్రదిష్ట కాదా..? ఇలాంటి సిఎం టూర్లు గతంలో రాష్ట్ర ప్రజలు చూడలేదు..? సిబిఐ కోర్టు ఇచ్చిన అనుమతి దావోస్ మీటింగ్ లో చూపిస్తారా..?

ఈ టూరు రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకా, లేక పోగొట్టేందుకా..? మీ దోపిడి సొమ్ము దాచుకునేందుకా..? దావోస్ కు అధికార యంత్రాగానిదో దారి, ముఖ్యమంత్రి దంపతులదో దారా..? స్పెషల్ ఫ్లైట్ కు ఒక ఖర్చు, కమర్షియల్ ఫ్లైట్ కు మరో ఖర్చా..? అందరూ కలిసివెళ్లకుండా సిఎం సెపరేట్ గా వెళ్లడం వెనుక మర్మం ఏమిటి..? అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంపై, ప్రజలపై ఇది అదనపు భారం కాదా..? విలువైన ప్రజాధనం దుర్వినియోగం చేసే హక్కు మీకెక్కడిది..? జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బైటపెట్టాలి.

జగన్ 3ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాడులు-దౌర్జన్యాలు, తప్పుడు కేసులు-అక్రమ నిర్బంధాలు, భూదందాలు-దోపిడీ పాలనపై ఆగ్రహావేశంతో ఉన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీ సహా అన్నివర్గాలు విసిగిపోయాయి. నియంతలపై ప్రజలు తిరగబడ్డప్పుడల్లా పలాయనం చిత్తగించడం చరిత్రలో చూశాం. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు మార్కోస్ ఇలానే చేశాడు, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘని కూడా పరారయ్యాడు, తాజాగా శ్రీలంక అధ్యక్షుడి పరిస్థితి అదే..ఇప్పుడిలా జగన్ రెడ్డి వెళ్లడాన్ని కూడా అదేకోవలో ప్రజలు చూస్తున్నారు. జగన్ రెడ్డి లండన్ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలి..అధికారిక పర్యటనల్లో పారదర్శకత పాటించాలి, జవాబుదారీగా ఉండాలి.. ప్రజల అనుమానాలు నివృతి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని యనమల రామకృష్ణుడు అన్నారు.

Also Read : రేపటినుంచే సిఎం విదేశీ పర్యటన

RELATED ARTICLES

Most Popular

న్యూస్