Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

CM has to come out: ప్రత్యేక హోదా కోసం సిఎం జగన్ తన కార్యాచరణ ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర కమిటీ అజెండాలో మార్పులు జరగడానికి సిఎం జగన్ కారణమని ఆరోపించారు. సిఎం జగనే తొందరపదడంలేదు మీరెందుకు హోదా అడుగుతున్నరంటూ కేంద్ర మంత్రులు, అధికారులు తమను ప్రశ్నిస్తున్నారని అయన వెల్లడించారు. జగన్ తన స్వప్రయోజనాల కోసమే హోదా అంశాన్ని వాడుకుంటున్నారని కనకమేడల  విమర్శించారు. కేంద్రం మేడలు వంచుతామన్నజగన్ ఇప్పటికైనా బైటకు వచ్చి పోరాడాలని సూచించారు.

 హోదా విషయంలో తెలంగాణా కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినా సాదించడంలో వైసీపీ విఫలమైందని కనకమేడల ఆరోపించారు. ఈ విషయమై వైసీపీ ఎంపీలు రాజీనామా చేసే తాము కూడా సిద్ధమేనని అయన ప్రకటించారు. హోదా ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏమిటో చెప్పాలని, ఒకవేళ తాము విఫలమయ్యామని వైసీపే చెబితే తమ కార్యాచరణ ఏమిటో చెబుతామన్నారు కనకమేడల. హోదాపై కేంద్రం తో పోరాటానికి జగన్ సిద్ధపడితే ఆయనతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com