Monday, June 8, 2026
HomeTrending Newsసిఎం, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

సిఎం, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి

must resign: ప్రత్యేక హోదా అంశంలో వైసీపీ విఫలమైందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశ ఎజెండాలో హోదా అంశాన్ని తొలగించడం వైసీపీ చేతగానితనానికి నిదర్శమన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చలేనప్పుడు పదవుల్లో కొనసాగే అర్హత వైసీపీకి లేదని, వెంటనే సిఎం జగన్, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదాపై సిఎం జగన్ ఆస్కార్ కు మించిన నటనను ప్రదర్శించారని, అందుకే ఆయనకు మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని అచ్చన్న వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెయిడ్ ఆర్టిస్టులతో హోదా డ్రామాలాడిన జగన్ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. జగన్ తన కేసుల మాఫీ కోసం హోదా ఆకాంక్షను అమ్మేశారని తీవ్రంగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular