Friday, April 4, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్క్యాంప్ ఆఫీసులో పులుల దినోత్సవం

క్యాంప్ ఆఫీసులో పులుల దినోత్సవం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో  ప్రపంచ పులుల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్‌  చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచిన ఓ పులి బొమ్మని సిఎం జగన్ తీక్షణంగా పరిశీలించారు.

రాష్ట్రంలో పులుల సంఖ్య 47 నుంచి 63కు పెరిగిందని, పులుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సిఎంకు వివరించారు. శేషాచలం అడవుల్లో పెద్దపులుల జాడ ఉందని అధికారులు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్