Monday, September 23, 2024
HomeTrending NewsYS Jagan: పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

YS Jagan: పూర్ణాహుతిలో పాల్గొన్న జగన్

ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత ఆరు రోజులుగా జరుగుతోన్న అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మీ యజ్ణం నేడు చివరిరోజుకు చేరుకుంది. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని శ్రీమహాలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత వేదపండితులు వేద పండితులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి, అవధూత పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామిజీల ఆధ్వర్యంలో ఈ పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.

ఈనెల 12న  సిఎం జగన్ సంకల్పం తీసుకొని ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేడు పాంచరత్న, వైదిక స్మర్త, వైఖానస, శైవాగమ యాగశాలల్లో అఖండ పూర్ణాహుతిలో ఆయన పాల్గొన్నారు., మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు నేటి కార్యక్రమానికి హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్