Sunday, June 14, 2026
HomeTrending Newsసిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్

సిఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: పాల్గొన్న జగన్

జీ 20 సదస్సు సన్నాహక ఏర్పాట్లపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు, సంనద్ధతపై ప్రధాని దిశా నిర్దేశం చేశారు.

సిఎం జగన్ తో పాటు సీఎస్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular