Thursday, April 25, 2024
Homeసినిమా'లవ్ యూ రామ్’ టీజర్ విడుదల చేసిన హరీష్ శంకర్

‘లవ్ యూ రామ్’ టీజర్ విడుదల చేసిన హరీష్ శంకర్

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌ల పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.

లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అబ్బాయే తనకు సర్వస్వం అని అమ్మాయి భావిస్తుంది కానీ.. అతని అసలు క్యారెక్టర్ గురించి తెలుసుకున్నప్పుడు ఆమె మోసపోయినట్లు భావిస్తుంది. భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరి ప్రేమకథ ఎక్కడ ముగుస్తుందో కథలో కీలకాంశం. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ , సంగీత దర్శకుడు కె వేద బ్రిలియంట్ వర్క్ చేశారు. ఈ చిత్రానికి ఎస్‌బి ఉద్ధవ్ ఎడిటర్, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. లవ్ యూ రామ్ దశరధ్ గారి స్టయిల్ లో ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైనింగ్ తీశారు. ఈ సినిమాని నార్వే లో షూట్ చేశారు. విజువల్స్ చాలా రిచ్ గా వున్నాయి. రోహిత్, అపర్ణ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. మన చౌదరి గారికి సినిమా తప్ప మరో ప్రపంచం తెలీదు. సినిమాని ప్రేమించే వ్యక్తి. కొన్ని సినిమాలని నిర్మించాలంటే దర్శకులే నిర్మాతలు కావాలి. ఆ నమ్మకం డైరెక్టర్లకే వుండాలి. దశరధ్ గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నాను. మీరంతా ఖచ్చితంగా ఆడరిస్తాని అనుకుంటున్నాను. ఇందులో దశరధ్ కూడా ఒక పాత్ర పోషించారు. చాలా మంచి పాత్ర అది. ఈ సినిమా తర్వాత ఆయన నటుడిగా కూడా బిజీ అవ్వడం ఖాయం. ఇందులో అద్భుతమైన మ్యూజిక్ వుంది. ఇందులో వుండే ఒక హిందీ పాట ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కథ, మ్యూజిక్, ప్రొడక్షన్, లోకేషన్స్, నటీనటులు హైలట్. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్