Thursday, March 28, 2024
HomeTrending Newsపెండింగ్ సమస్యలు పరిష్కరించండి: సిఎం

పెండింగ్ సమస్యలు పరిష్కరించండి: సిఎం

Resolve them: రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ చేరుకున్న సిఎం సాయంత్రం ప్రధానితో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.  రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి వినతిపత్రం అందించారు.  పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్‌ ప్లాంట్, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, తెలంగాణ డిస్కంల నుంచి రాష్ట్రానికి బకాయిలు తదితర అంశాలను ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి నివేదించిన అంశాలపట్ల సానుకూలంగా ప్రధాని సానుకూలంగా స్పందించారు.

ప్రధానికి సిఎం  అందించిన వినతి పత్రంలోని కొన్ని ముఖ్యాంశాలు:

  • 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
  •  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం.
  •  పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరుతున్నాను.
  • జాతీయ ఆహార భద్రతా చట్టం లో రాష్ట్రానికి న్యాయం చేయాలి
  • భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాలి
  • రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలి
  • అలాగే ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలి
  • రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలి
  •  విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది. రెవిన్యూ గ్యాప్‌ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఆమేరకు ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లింది. దీన్ని భర్తీ చేయాలి
  •  తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది.  ఈ మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను
RELATED ARTICLES

Most Popular

న్యూస్