CM Review on Floods :
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నేడు మరోసారి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత రాత్రే అధికారులు ఆయా జిల్లాలకు చేరుకున్నారు. భారీ వర్షాల వల్ల సంభవిస్తున్న వరదల నేపథ్యంలో సహాయ చర్యలను ఆ అధికారులు స్వయంగా పర్యవేక్షించనున్నారు. అలాగే వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదిస్తారు. నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, వైయస్సార్ జిల్లాకు మరో సీనియర్ అధికారి శశిభూషణ్‌కుమార్‌ను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది.
Also Read : తిరుమల: రెండ్రోజులు నడకదారి బంద్