రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోన్న మాండోస్ తుపానుపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో తుపాను ప్రభావంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, భారీవర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ప్రత్యేకించి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరిచి.. వారికి అన్నిరకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు.