Saturday, January 18, 2025
HomeTrending Newsమీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్

మీరు నా కళ్ళు, చెవులు: సిఎం జగన్

 Implementing Schemes : పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తేవడానికి, వారి పట్ల మరింత బాధ్యతగా ఉండడానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న అంశాన్ని ప్రతి కలెక్టర్‌కు, ఎస్పీ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిఎం జగన్ మాట్లాడారు.

ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష,  ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, వైద్య, విద్యాశాఖలో నాడు – నేడు, స్పందన కింద అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.

ఈ సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

  • తాము బాస్‌లం కాదు, ప్రజలకు సేవకులుగా ఉంటామనే విషయాన్ని వారు నిరంతరం దృష్టిలో పెట్టుకోవాలి
  • ప్రజల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలి
  • మనం ఎదిగే కొద్దీ, ఒదగాలి.. దీన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి
  • ఇప్పుడు మీరంతా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నేను మీకు ఇచ్చే సలహా ఇది
  • స్పందన అర్జీల పరిష్కారంలో వివిధ స్ధాయిలో పర్యవేక్షణ జరగాలి
  • సచివాలయం స్ధాయి నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు కలుపుకుని వివిధ స్ధాయిలో ఈ పర్యవేక్షణ ఉండాలి స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యమైనది:
  • సచివాలయాల పై ఎంత దృష్టి పెడితే అంత సమర్దవంతంగా పనిచేస్తాయి
  • కలెక్టర్, జేసీలు వారానికి రెండు సచివాలయాలు పర్యటించాలి
  • దిగువస్ధాయి అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలు సందర్శించాలి
  • మీరు సందర్శనకు వెళ్లినప్పుడు వచ్చే నెలలో రానున్న పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ చేశారా లేదా అన్నది చూడాలి
  • ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించిన మరలా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి
  • సచివాలయ సిబ్బంది పనితీరు ఎలా ఉందనేది పర్యవేక్షించాలి
  • మీరు మంచి చేస్తే నేను మంచిచేసినట్లవుతుంది, మీరు నా కళ్లు చెవులు
  • రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం
  • రూ.1.37 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా వేశాం
  • ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది

స్పందన వీసీలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : నీతి ఆయోగ్ సదస్సులో సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్