CM Jagan Suggested Officials To Concentrate On Polavaram RR Works :
అలసత్వానికి తావులేకుండా పోలవరం పునరావాస పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి పోలవరం సందర్శించి నిర్వాసితులను కలుస్తానని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులను తొలుత ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనులు, ముంపు ప్రాంతాలను పరిశీలించిన జగన్, సైట్ వద్ద కూడా పనుల తీరుపై ఆరా తీశారు. స్పిల్ వే, అప్రోఅచ్ చానల్ పనులను కూడా పరిశీలించారు, పురోగతిపై అధికారులతో పాటు నిర్మాణ సంస్థ పర్తినిధులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఫోటో గ్యాలరీని తిలకించారు. అనంతరం అధికారులతో గోదావరికి వస్తున్నవరద, నిర్వాసితుల పునరావాసం, ప్యాకేజీపై సమీక్షించారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టు నాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు.
సమీక్ష సందర్భంగా సిఎం జగన్ చేసిన సూచనలు
- పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికే పూర్తి చేయాలి
- 2022 జూన్ నాటికి రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి
- టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలి
- మా ప్రభుత్వం వచ్చాకే ఆర్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం
- ఆర్ ఆర్ పనులు పూర్తి నాణ్యతతో ఉండాలి
- ఆర్ధికంగా ఇబ్బందులున్నా ఆర్ ఆర్ బిల్లులు పెండింగ్ లో పెట్టొద్దు
- నిర్వాసితులకు జీవనోపాధి, నైపుణ్యాభివృపై కూడా దృష్టి సారించాలి
- వరదల సమయంలో నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేయాలి
- కేంద్రం నుంచి రూ. 2,200 కోట్లు రావాల్సి ఉన్నా పనులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోంది
Also Read : గోరంత దీపం – కొండంత వెలుగు