Tuesday, May 6, 2025
HomeTrending NewsYSR Matsyakara Bharosa: నేడు మత్స్యకార భరోసా సాయం విడుదల

YSR Matsyakara Bharosa: నేడు మత్స్యకార భరోసా సాయం విడుదల

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్‌ మత్స్య కార భరోసా అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్‌ 15– జూన్‌ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్లు, ఓఎన్‌జీసీ సంస్థ పైప్‌ లైన్‌ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ. 108 కోట్లతో కలిపి…మొత్తం రూ. 231 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

నేడు అందిస్తున్న సాయంతో కలిపి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి. వచ్చిననాటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం క్రింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 538 కోట్లు, ఏటా రూ. 10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 50 వేల లబ్ధి చేకూరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

సముద్రంపై వేటకు వెళ్లే మత్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మత్య్య ఎగుమతులకు మరింత ఊతమిస్తూ ఈ నాలుగేళ్లలోనే సుమారు రూ. 16,000 కోట్ల వ్యయంతో 4 పోర్టుల నిర్మాణానికి కూడా చర్యలు మొదలు పెట్టింది.

ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 లకే సబ్సిడి పై విద్యుత్‌ సరఫరా. ఆక్వా కల్చర్‌ వ్యాపార కార్యకలాపాల పర్వవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కలర్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ 2020. ఆంధ్రప్రదేశ్‌ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) యాక్ట్ 2020 అమలు… ఇన్‌ పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందించడానికి తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ ఏర్పాటు లాంటి చర్యలతో మత్స్య శాఖ అభివృద్దికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్