ఎన్నికల ఏడాది కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పదవుల భర్తీపై దృష్టి సారించారు. రేపు పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. దాదాపు 100 కార్పొరేషన్ ఛైర్మన్ ల పదవుల నియామకం చేయనున్నారు. రెండేళ్ళ క్రితం… 2021 జూలై 17 న ఒకే రోజు 69 రాష్ట్ర స్థాయి,66 జిల్లా స్థాయిల్లో వివిధ కార్పొరేషన్లు, జిలా సహకార బ్యాంకులు, ప్రాంతీయ ఆర్టీసీ ఛైర్మన్ పోస్టులతో సహా మొత్తం 135 కార్పొరేషన్ లకు ఛైర్మన్ లను నియమించారు. వీటికి ముందే 2020డిసెంబర్ లో 56 బిసి కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తూ వాటికి ఛైర్మన్, డైరెక్టర్ల ను కూడా ప్రభుత్వం నియమించింది. వీటి పదవీకాలం రెండేళ్ళు ముగిసింది. దీనితో కొత్త ఛైర్మన్, డైరెక్టర్ ల నియామానికి జగన్ కసరత్తు మొదలు పెట్టారు.
ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఛైర్మన్ గా నియమించినా, బోర్డు మెంబర్ ల నియామకాలు ఇంకా చేయాల్సి ఉంది. కార్పొరేషన్ల తో పాటే టిటిడి సభ్యుల పేర్లను కూడా ఖరారు చేస్తారని సమాచారం.