NHs in AP: రాష్టంలో నిర్మిస్తోన్న రహదారులు, ఇతర ప్రాజెక్ట్ ల ప్రారంభం, భూమి పూజ నేడు జరగనుంది. నిర్మాణం పూర్తి చేసుకున్న విజయవాడ బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లై ఓవర్ ను నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.
విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం మధ్యాహ్నం 12.05 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం చేరుకుని, గడ్కరీతో కలిసి జాతీయ రహదారుల అభివృద్ది సంస్ధ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తారు. వీటితో పాటు మరో 31 జాతీయ రహదారుల ప్రాజెక్ట్ లకు భూమి పూజ చేసి, అక్కడి బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.55 గంటలకు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని కొత్తగా నిర్మించిన పశ్చిమ దిశ ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తారు.
Also Read :మే చివరి నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి