ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన జస్టిన్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

ప్రస్తుత గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్ గ రాష్ట్రానికి బదిలీపై వెళ్ళిన సంగతి తెలిసిందే. అయన ఈ ఉదయమే రాష్ట్రనుంచి బయల్దేరి వెళ్ళారు. సాయంత్రానికి నూతన గవర్నర్ రాష్ట్రానికి విచ్చేశారు. అబ్దుల్ నజీర్ ఈనెల 24న శుక్రవారం నూతన గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం  ఏర్పాట్లు చేస్తోంది.

Also Read : తండ్రిలా..పెద్దలా గవర్నర్ పై సిఎం ప్రశంస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *