Monday, June 8, 2026
HomeTrending Newsవరంగల్ చేరుకున్న సిఎం కెసిఆర్

వరంగల్ చేరుకున్న సిఎం కెసిఆర్

వరదల నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం చేపట్టనున్న ఏరియల్ సర్వే, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం వరంగల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, పల్లా రాజేశ్వరరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, వైద్య ఆరోగ్యశాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. సాయంత్రం వరంగల్ చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. హన్మకొండలో ఈ రోజు రాత్రి మాజీ ఎంపి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు.

ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలీకాప్టర్ లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో పర్యటించి వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్ధానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఏటూరు నాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా దిగి, వరద సహాయక చర్యలను తెలుసుకుంటారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటూరు నాగారం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర వరద బాధిత ప్రాంతాలలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా సీఎం కేసీఆర్ వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular