Thursday, April 25, 2024
HomeTrending Newsస్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స

స్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స

రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం లేదని, కొన్ని చోట్ల విలీనం మాత్రమే చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా మూసివేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే విద్యా మంత్రిగా తానూ బాధ్యత వహిస్తానని ప్రకటించారు.  ఒక్క స్కూల్ మూసినట్లు చూపించాలని సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో బొత్స మీడియాతో మాట్లాడారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు విషయమై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు.

అంగన్ వాడీలని ఫౌండేషన్‌ స్కూల్స్ గా మారుస్తున్నామని, 1,2 తరగతుల వారికి ఇక్కడ విద్యా బోధన జరుగుతుందని, 3,4,5  తరగతులను అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో విలీనం చేస్తున్నామని, 3నుంచి 8 వరకూ రెండో దశ స్కూల్స్ గా ఉంటాయని, ఒక్కో తరగతికి ఐదు సబ్జెక్టులకు ప్రత్యేకంగా టీచర్లను నియమిస్తున్నామని, ఒక కిలోమీటర్ పరిధిలో ఇవి ఉంటాయని వివరించారు. ఎక్కడైనా కొన్ని చోట్ల వాగులు, నదులు దాటి విద్యార్ధులు రావాల్సి వస్తే అలాంటి ప్రాంతాల నుంచి 270 వరకూ విజ్ఞప్తులు వచ్చాయని, వీటిపై పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగానే ఈ మార్పులు తీసుకోచ్చామన్నారు.  4,800 కోట్ల రూపాయలతో నాడు-నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్ళని డిజిటల్ క్లాసుల కోసం వినియోగిస్తామన్నారు బొత్స.  ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్