Sunday, June 14, 2026
HomeTrending NewsBRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

BRS: మహారాష్ట్రలో బలోపేతం అవుతున్న బిఆర్ఎస్

బిఆర్ఎస్ లో చేరికల పర్వం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. బుధవారం మరో కీలక నేత బిఆర్ఎస్ లో చేరారు. ఔరంగాబాద్, పర్భణీ జిల్లాల్లో పట్టువున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత ‘అభయ్ కైలాస్ రావు పాటిల్ చిక్టాగావోంకర్’ బుధవారం బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా గులాబీ కండువాను స్వీకరించి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
అభయ్ కైలాస్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం కలదే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణీ పరిసర ప్రాంతాల్లో వీరికి ప్రజాభిమానం గొప్పది. ఆ ప్రాంతాల్లో వీల్ల కుటుంబానికి మంచి రాజకీయ పట్టువున్నది. పాటిల్ తండ్రి మాజీ ఎమ్మెల్యే కైలాస్ పాటిల్,వీరు ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రజాసేవ చేశారు. వీరి తాతగారు దిగంబర్ రావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేనే. వీరి చిన్నాయన బావు సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యే గా రెండు సార్లు పోటీచేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్ మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. వీరి కుటుంబం అంతా రాజకీయనేపథ్యం కలిగినది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తదితరులున్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు:
సిఎం కేసీఆర్ నాయకత్వానికి మహారాష్ట్ర జయ జయ ధ్వానాలు పలుకుతున్నది. తెలంగాణ ఉద్యమ సారథిగా తనకు ఎట్లయితే తెలంగాణ ప్రజల్లోంచి మద్దతు పెల్లుబికిందో అదే తరహా స్పందన మహారాష్ట్ర ప్రజలనుంచి కనిపిస్తుండడం గమనార్హం. రాష్ట్రంగా ఏర్పడకముందు తాగునీరు లేక, సాగునీరు లేక, వ్యవసాయానికి ఆదరణ లేక తెలంగాణ ఎట్లుండెనో ఇప్పుడు మహారాష్ట్ర జిల్లాల్లో పరిస్థితులు కూడా అట్లనే వున్నాయి. ‘మా నీల్లు మా వనరులు మా నిధులు మాకే’ అనే నాటి తెలంగాణ నినాదం నేడు దేశ ప్రజలకోసం మారుమోగుతోంది. తమ భవిష్యత్తు నాయకత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ లో మహారాష్ట్ర ప్రజలు చూసుకుంటున్నారు.

దేశంలో ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ స్థాపనకు నడుం కట్టి, సిఎం కేసీఆర్ ప్రారంభించిన మహా ఉద్యమ పోరాటానికి వూహించని రీతిలో మహారాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. మెదటిసారి నాందేడ్ సభకు ధీటుగా మొన్నటి కాందార్ లోహ లో జరిగిన రెండవ సభ విజయవంతం కావడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ ప్రభంజనం సెగ తగలుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular