Thursday, June 11, 2026
HomeTrending Newsఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే హైదరాబాద్ ప్రగతి భవన్ చేరుకున్నారు. కేసీఆర్ తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ పలువురు రైతు సంఘాల నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ఎంపీలతో చర్చలు జరిపారు. బీఆర్‌ఎస్‌, టీఆర్ఎస్ కార్యాలయాల పనులను కేసీఆర్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పరిపాలన, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిధుల సమీకరణపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో హస్తినలోనే సీఎం సమీక్షించారు. మరికాసేపట్లో మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్షించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular