Saturday, November 23, 2024
HomeTrending Newsసామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్

సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ: సీఎం కేసీఆర్

దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని చెప్పారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగినప్పుడు అనేక అనుమానాలు ఉండేవన్నారు. అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అన్నీ అధిగమించి ప్రగతి పథంలో నడుస్తున్నామన్నారు.రాష్ట్రం సాధించనన్ని అద్భుత ఫలితాలు తెలంగాణ సాధించిందని, దళితబంధు వంటి అనేక ఆవిష్కరణలు గావించామని వెల్లడించారు. రాష్ట్రంలో అనేక విషయాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పారు. చాలా రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందని చెప్పారు. విద్య, విద్యుత్‌, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామన్నారు. మనందరి సామూహిక స్వప్నం.. బంగారు తెలంగాణ సాధన అన్నారు.

తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని, రాష్ట్రంలోని మారుమూల గ్రామంలోనూ భూమి ధర పెరిగిందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయన్నారు. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతున్నదని చెప్పారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని వెల్లడించారు. కులం, మతం, జాతి వివక్ష లేకుండా ముందుకువెళ్తున్నామని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు.

Also Read : శుభకృత్ సంవత్సర ఫలాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్