Friday, April 19, 2024
HomeTrending Newsరెండు నెలల్లో మిగిలిన పోర్టులకూ భూమిపూజ

రెండు నెలల్లో మిగిలిన పోర్టులకూ భూమిపూజ

Ports: రాబోయే కాలంలో మన రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఒక పోర్టు గానీ  ఉండబోతుందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పోర్టులతో ఆర్ధిక కార్యకలాపాలు విస్తరిస్తాయని, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సరకుల రవాణా ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. ఏదైనా ఒక ప్రాంతానికి పోర్టు రావడం అనేది దేవుడిచ్చిన వరంగా ఆయన అభివర్ణించారు. తాము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఈ పోర్టులో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని చెప్పారు. రామయపట్నం పోర్టు, దానికి అనుబంధంగా ఇతర వ్యాపారాలతో ఆ ప్రాంత రూపు రేఖలు మారతాయని, రాష్ట్ర ప్రగతికి కూడా  ఊతమిస్తుందని వస్తుందని చెప్పారు. రామయపట్నం పోర్టు పనులకు సిఎం జగన్ నేడు భూమి పూజ చేశారు.

ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు… భూ సేకరణ, డీపీఆర్ లేకుండానే గత ప్రభుత్వం రామయపట్నం పోర్టుకు శంఖుస్థాపన చేశారని, ప్రజలను మోసం చేసేందుకే ఇలా చేశారని సిఎం విమర్శించారు.  కానీ తాము 850 ఎకరాల భూమి సేకరించి, 3,700 ఓట్ల రూపాయలతో   పనులు మొదలు పెడుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయని, తాము మరో నాలు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని చెప్పారు.   కాకినాడ గేట్ వే , మచిలీపట్నం, రామయ పట్నం, భావనపాడుల్లో కొత్త పోర్టులు వస్తున్నాయని వివరించారు. విశాఖ పోర్టు నుంచి 75 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఉంతే, మిగిలిన ఐదు పోర్టుల నుంచి 158 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉన్నాయని. తాము కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ నాలుగు పోర్టుల ద్వారా మరో 100 మిలియన్ టన్నులు కొత్తగా అందుబాటులోకి వస్తుందన్నారు.

ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కాగా,పోర్టులలో మొదటగా నేడు రామయపట్నం పనులు మొదలు పెట్టుకున్నామ్నని, రాబోయే రెండు నెలల్లో మిగిలిన రెండు పోర్టులకు కూడా భూమి పూజ చేస్తామని వెల్లడించారు. తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు పూర్తయితే లక్ష మంది మత్స్య కారులకు ఉపాధి కలుగుతుందన్నారు. గుజరాత్ కో, మరో చోటకో వెళ్ళే పని లేకుండా స్థానికంగానే వారు పనిచేసుకోవచ్చన్నారు.  కొత్తగా రాబోతున్న పోర్టుల ద్వారా నేరుగా మూడు నాలుగు వేల మందికి నేరుగా ఉద్యోగాలు వస్తాయని, మొత్తంగా 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు మహీధర్ రెడ్డి,  ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవరావు, అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్