Saturday, June 13, 2026
HomeTrending Newsఅంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లపై సిఎం సమీక్ష

అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లపై సిఎం సమీక్ష

విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని, అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని, పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం పనుల నిర్మాణ పురోగతిపై  సిఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై సిఎం ఆరా తీశారు.

అధికారులు సమావేశంలో తెలిపిన వివరాలు:

  • విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుంది.
  •  అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లు.
  •  పీఠం భాగంలో జీ ప్లస్‌ టూ నిర్మాణం ఉంటుండి,  ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుంది
  •  విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడి వినియోగం
  • మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తి
  • జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్‌ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు
  • ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలింపు పూర్చాతి
  •  దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం
  • కార్‌ పార్కింగ్, బస్‌ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం
  • సిఎం ఆదేశాలతో అంబేద్కర్‌ స్మృతి వనానికి దారితీసే రోడ్ల  సుందరీకరణపై దృష్టి

ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢిల్లీరావు, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular