Saturday, January 18, 2025
HomeTrending NewsAP CM: రవాణా రంగంలో సంస్కరణలు: సిఎం సూచన

AP CM: రవాణా రంగంలో సంస్కరణలు: సిఎం సూచన

నాటుసారా తయారీ చేస్తున్న కుటుంబాలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికి  ప్రత్యామ్నాయ జీవోనోపాధి మార్గాలు చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  ఇప్పటికే 16.17 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని అధికారులు తెలియజేయగా దీన్ని నిరంతరం కొనసాగించాలని, వారిలో చైతన్యం కలిగించాలని ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.  2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరుపై ఆరా తీసి , విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సిఎం అడిగి తెలుసుకున్నారు.

సిఎం చేసిన సూచనలు 

  • రవాణారంగంలో సంస్కరణలపై దృష్టిపెట్టాలి. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలి
  • అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలి,  వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేషించాలి
    ఇవి కొనుగోలు దారులకు ఎంకరేజ్‌ చేసేలా ఉండాలి
  • ఆదాయాన్ని ఆర్జించే విభాగాలు.. జిల్లాకలెక్టర్ల మధ్య సమన్వయాన్ని పెంచాలి.  క్రమం తప్పకుండా వారితో సమీక్షలు నిర్వహించి ఆదాయాలు పెంచుకునే విధానాలపై వారికి కూడా అవగాహన కల్పించాలి
  • ఆర్ధికశాఖ అధికారులు కూడా కలెక్టర్లతో నిరంతరం మాట్లాడాలి,  దీనివల్ల ఆదాయాన్నిచ్చే శాఖలు మరింత బలోపేతం అవుతాయి, ఎక్కడా లీకేజీలు లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుంది.

అధికారుల వివరణ: 

గత ఏడాదితో పోలిస్తే తొలి త్రైమాసికంలో  జీఎస్టీ (కాంపెన్‌సేషన్‌ కాకుండా) పన్నుల వసూళ్లు పెరిగాయని, జూన్‌ వరకూ రూ. 7,653.15 కోట్ల జీఎస్టీ పన్నుల వసూళ్లు అయ్యాయని అధికారులు తెలిపారు.

గతంతో పోలిస్తే మద్యం అమ్మకాలు తగ్గాయని, అదే సమయంలో ఆదాయం పెరిగిందని…
2018–19తో పోలిస్తే.. తగ్గిన మద్యం అమ్మకాలు.
2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.36 లక్షల కేసులు కాగా, 2022–23లో 335.98 లక్షల కేసులు.
2018–19లో బీరు అమ్మకాలు 277.16 లక్షల కేసులుకాగా, 2022–23లో 116.76 లక్షల కేసులు.
2018–19 ఏప్రిల్, మే, జూన్‌ నెలలతో పోల్చిచూస్తే, 2023–24లో ఏప్రిల్, మే, జూన్‌ నెలలో బీరు అమ్మకాల్లో మైనస్‌ 56.51 శాతంగా, తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని, లిక్కర్‌ అమ్మకాల్లో మైనస్‌ 5.28 శాతంగా, తక్కువ అమ్మకాలు నమోదయ్యాయని వెల్లడించిన అధికారులు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని,  గత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి జులై 15 వరకూ రూ. 2291.97 కోట్లు ఉండగా, ఈ ఆర్ధిక సంవత్సరం అదే కాలంలో రూ. 2793.7 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

గనులు – ఖనిజాల శాఖ నుంచి గడచిన మూడేళ్లలో 32 శాతం సీఏజీఆర్‌ సాధ్యమైందని వెల్లడించిన అధికారులు.
2018–19లో ఈ శాఖనుంచి ఆదాయం రూ. 1,950 కోట్లు వస్తే, 2022–23 నాటికి రూ. 4,756 కోట్లు వచ్చిందని వెల్లడించిన అధికారులు.
గణనీయంగా ఏపీఎండీసీ ఆర్థిక పనితీరు మెరుగుపడిందన్న అధికారులు.
2020–21లో ఏపీఎండీసీ ఆదాయం కేవలం రూ.502 కోట్లు కాగా, 22–23లో రూ.1806 కోట్లకు పెరిగిన ఏపీఎండీసీ ఆదాయం.
2023–24 నాటికి రూ.4వేలకోట్లకు ఏపీ ఎండీసీ ఆదాయం చేరుతుందని అంచనా.
మంగంపేట బైరటీస్, సులియారీ బొగ్గుగనుల నుంచి భారీగా ఆదాయం తెచ్చుకుంటున్న ఏపీఎండీసీ.
సులియారీ నుంచి ఈ ఏడాది 5 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన అధికారులు.

గతంలో గనులు, ఖనిజాలు శాఖ, ఏపీఎండీసీ నుంచి వచ్చే ఆదాయాలుకు, ఈ ప్రభుత్వం వచ్చాక వస్తున్న ఆదాయాల్లో భారీ వ్యత్యాసం ఉందని ఆదాయాలు గణనీయంగా పెరిగాయని సిఎం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్