వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ ద్వారా గర్భవతులు, బాలింతలకు ఇస్తోన్నటేక్ హోం రేషన్ అత్యంత నాణ్యంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద 2 కేజీల రాగిపిండి, కేజీ అటుకులు, పావు కిలో బెల్లం, పావుకిలో చిక్కి, పావుకిలో డ్రై ఫ్రూట్స్, 3 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో వంటనూనె, 25 కోడి గుడ్లు, 5 లీటర్ల పాలు…. వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద పై వస్తువుల్లో చిక్కి, డ్రై ఫ్రూట్స్ పావు కిలో బదులు అరకిలో అందిస్తున్నారు.
ఈ సరుకుల పంపిణీపై మంచి ఎస్‌ఓపీ పాటించాలని, క్వాలిటీ సర్టిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలని సిఎం సూచించారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు
ఈ సందర్భంగా సిఎం పలు సూచనలు చేశారు….
- సరుకుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా, అర్హులైన వారందరికీ అందేలా చూడాలి.
- ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో దీన్ని అనుసంధానం చేయాలి
- పిల్లల ఎదుగుదల, టీకాలు, పౌష్టికాహారం, చక్కటి ఆరోగ్యపు అలవాట్లు తదితర వాటిపై పర్యవేక్షణ చేయాలి.
- చికిత్సకు అవసరమైన వారిని రిఫరెల్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి
- ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు అంగన్‌వాడీల సూపర్‌వైజర్ కూడా ఉండి.. ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి
- పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
- ఇంగ్లిషు భాషపై అదే దశలో పిల్లలకు పునాది పడాలి
- పదాలు పలికేతీరు, ఫొనిటెక్స్ తదితర అంశాలపై శ్రద్ధపెట్టాలి
- పిల్లలు త్వరగా నేర్చుకునే వయసు కాబట్టి వారికి అత్యుత్తమ బోధన అందించాలి
అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపైనా సిఎం సమీక్ష.
- అంగన్‌వాడీ సెంటర్లలో తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్ ఇలా అన్నిరకాలుగా కనీస సదుపాయాలతో అభివృద్ధి చేయాలి
- నాడు–నేడు ఫేజ్–2లో భాగంగానే ఈ పనులను పూర్తిచేయాలి
- ఆగస్టు 15 కల్లా ఈ పనులు ప్రారంభం కావాలని, ఫేజ్ –2 కార్యక్రమంలో భాగంగా స్కూళ్లలో చేపడుతున్న పనులతో పాటు ఇవి పూర్తి కావాలి
- బాల్య వివాహాల నిరోధంలో కళ్యాణమస్తు, షాదీతోఫా, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలు కీలక పాత్ర పోషిస్తాయి
- ఒక్కసారి టెన్త్ చదివాక తర్వాత ఇంటర్మీడియట్‌కు అమ్మ ఒడి, ఆపై చదువులకు విద్యాదీవెన, వసతి దీవెన అమలవుతున్నాయి
- టెన్త్ తర్వాత చదువులు ఆపేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక జూనియర్ కళాశాలలు బాగా తోడ్పడతాయి