Thodu : రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాల సంక్షేమమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న చేదోడు’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్ధిక సహయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అందించనున్నారు. తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా పాల్గొని లబ్దిదారుల అకౌట్లలో ఈ సాయాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది లబ్ధిదారులకు 285.35 కోట్ల రూపాయలను అందించనున్నారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ పథకంపై ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ. 583.78 కోట్లు అవుతుంది.
- 1,46,103 మంది టైలర్లకు రూ. 10 కోట్ల లబ్ధి
- 98,439 మంది రజకులకు రూ. 44 కోట్ల లబ్ధి
- 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 81 కోట్ల లబ్ధి