Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎం వినాయక చవితి శుభాకాంక్షలు

సిఎం వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్,  క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి తాదేపల్లిలోని నివాసంలో సిఎం జగన్, భారతి దంపతులను కలుసుకున్నారు. దేశవాళీ అవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగన్ కు ఆమె గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వివరించారు.

సేవ్ దేశి కౌస్ కార్యక్రమానికి మద్దతివ్వాలని భారతిని దివ్యారెడ్డి కోరారు. దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని వైఎస్ భారతి అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్