Saturday, May 11, 2024
Homeసినిమా‘గుండెక‌థ వింటారా’ చిత్రంలోని పాటకు ఆదరణ

‘గుండెక‌థ వింటారా’ చిత్రంలోని పాటకు ఆదరణ

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నచిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిష్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి ‘ఎంత బావుందో..’ ఫుల్ వీడియో సాంగ్ విడుద‌లై శ్రోత‌ల‌ నుంఛి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంటుంది.

“ఎంత బావుందో.. ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా… గుప్పెడు గుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది.. పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది.. బ‌హుశా ఎదురుప‌డ‌నంది” అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి సాంగ్‌కి మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వ‌రుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ గుండె క‌థ వింటారా చిత్రాన్ని త్వ‌ర‌లో విడుద‌ల‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్