Sunday, January 19, 2025
HomeTrending Newsరైతు బాంధవుడు కేసీఆర్ - మంత్రి వేముల

రైతు బాంధవుడు కేసీఆర్ – మంత్రి వేముల

Raitubandhu Vemula Prashanth Reddy  :రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు,రైతు బాంధవుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాన్స్ వాడ నియోజకవర్గం రుద్రూరు మండలం లో 2.14 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాంతీయ చెఱుకు మరియు వరి పరిశోధన కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. 8వ విడత రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తో కలిసి పాలాభిషేకం చేసి రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

రైతులకు పెట్టుబడి సాయం కింద దేశానికే దిక్సూచిగా “రైతుబంధు” కార్యక్రమం అమలవుతుందన్నారు.టంచనుగా రైతుల ఖాతాల్లో వారి వ్యవసాయ అవసరాల నిమిత్తం డబ్బులు జమ అవుతున్నాయని,వారి సెల్ ఫోన్లకు టంగ్ టంగ్ మంటూ మెసేజులు వస్తున్నాయని చెప్పారు.8వ విడత రైతు బంధు డబ్బులు రైతు ఖాతాల్లో నిన్నటి నుంచే జమ అవుతున్నాయని,రైతు బంధుతో ఇప్పటివరకు 50వేల కోట్ల నగదు రైతులకు సాయంగా అందజేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.రైతుల కోసం ఇంత పెద్ద సాహసం ఇప్పటివరకు ఎవరూ చేయలేదని అన్నారు.రైతుల పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్