సుడాన్ లో గిరిజనుల మధ్య జరిగిన గొడవల్లో సుమారు 31 మంది చనిపోయారు. బ్లూ నైల్ రాష్ట్రంలోని వివిధ నగరాల్లో రాజుకున్న గొడవలు రక్తసిక్తంగా మారాయి. బెర్టి – హౌసా గిరిజన తెగల మధ్య జరిగిన గొడవలు బ్లూ నైల్ రాష్ట్రాన్ని అల్లకల్లోం చేశాయి. గొడవల్లో సుమారు 39 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఇల్లు, దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. శుక్రవారం జరిగిన గొడవలు ఉపద్రవం సృష్టించాయి. అల్- దమజిన్, అల్ -రుస్సైర్స్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.
విద్యుత్ పంపకాల అంశంలో బెర్టి – హౌసా రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగాయని ప్రాథమిక సమాచారం. ఇథియోపియా సరిహద్దుల్లో ఉన్న రుస్సైర్ డ్యాం మీద విద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. దీని నుంది ఉత్పత్తి అయ్యే విద్యుత్ కోసం రెండు గిరిజన తెగలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వాదోపవాదనలు ఘర్షణలకు దారితీశాయి. ఈటెలు.. విల్లంబులతో కాగడాలతో ఇరు వర్గాలు పర్సాపారం దాడులకు దిగాయి.
సుడాన్లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ అధికారం చేజిక్కించుకున్నాక పరిపాలన గాడి తప్పింది. సైనికాధికారి అబ్దేల్ ఫతః అల బుర్హాన్ పాలన పగ్గాలు చేపట్టక దేశంలో విద్యుత్ కోతలు అధికం అయ్యాయి. 2021 అక్టోబర్ నుంచి ఎదాదికాలంగా సుడాన్ దేశం ఎమెర్జెన్సి లో మగ్గుతోంది. ప్రజల బాగోగులు, మౌలికి సౌకర్యాలు పట్టించుకునే నాథుడు లేదు. పశ్చిమ దేశాల క్రీడా మైదానంగా మారిన సుడాన్ లో అరబ్బులు- అరబ్బేతరులు, గిరిజన తెగల మధ్య నిత్య తగువులు జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవ- ముస్లింల ఆధిపత్యం కోసం జరుగుతున్న రాజకీయాల్లో సుడాన్ ప్రజలు బలిపశువులుగా మారారు.
Also Read : సుడాన్లో నిరసనలు హింసాత్మకం