Saturday, January 18, 2025
HomeTrending Newsకరోనాతో కాంగ్రెస్ ఎంపి మృతి

కరోనాతో కాంగ్రెస్ ఎంపి మృతి

కరోనాకు మరో పార్లమెంట్ సభ్యుడు బలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ శాతవ్ శాతవ్ కరోనాతో మృతి చెందారు. అయన వయసు 46 సంవత్సరాలు. కరోనా సోకడంతో 23 రోజులుగా పూణే లోని జహంగీర్ ఆస్పత్రిలో అయన చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ దాని సంబంధిత న్యుమోనియాతో బాధపడుతూ నేటి ఉదయం మరణించారు.

2014లో మహారాష్ట్రలోని హింగోలి నుంచి లోక్ సభకు ఎన్నికైన రాజీవ్ 2019 ఎన్నికల్లో పోటి చేయలేదు. గత ఏప్రిల్ లో అయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. శాతవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. రాజీవ్ శాతవ్ గతంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.

శాతవ్ మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్