Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష ధోరణి అవలంబిస్తూ.. ఈడీ విచారణ పేరుతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎఐసిసి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నేడు జూలై 21న సోనియాగాంధీ ఈ.డి ఆఫీసుకు విచారణకు హాజరవుతున్న సందర్భంగా టిపిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం నుంచి ఈ.డి కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా చేపాట్టారు. ఈ  కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసిసి మెంబర్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read : నేడు ఈడి విచారణకు సోనియాగాంధి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్