గుజరాత్ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ఇటీవల వార్తలు ఉపందుకున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం హర్దీక్ పటేల్ ను బుజ్జగించే చర్యలు చేపట్టింది. రాహుల్ గాంధీ దూతగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రఘు శర్మ.. హర్దీక్ తో సమావేశమయ్యారు. హర్దీక్ పటేల్ పార్టీ మారుతున్నాడనే వార్తల్లో నిజం లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రణదీప్ సుజేవాలా స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య వున్నా విభేదాలు త్వరలోనే కొలిక్కి వస్తాయని వెల్లడించారు.

అయితే గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల హార్థిక్ పటేల్ కామెంట్స్ చేశాడు. తాజాగా తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ ను తొలగించాడు. దీంతో హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే హార్థిక్ పటేల్ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పంజాబ్ లోలాగే గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ఆప్ నుంచి కూడా హర్థిక్ పటేల్ కు ఆహ్వానాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read : నేపాల్ నైట్ క్లబ్ ఎఫెక్ట్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *