Sunday, February 23, 2025
HomeTrending Newsకానిస్టేబుల్ రాత పరీక్ష వారం వాయిదా

కానిస్టేబుల్ రాత పరీక్ష వారం వాయిదా

తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఆగస్టు 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించాలని నిర్ణయించారు. సాంకేతిక కారణాల రీత్యా తేదీని మార్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కానిస్టేబుల్ పరీక్షలకు హైదరాబాద్ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నియామక బోర్డు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదలైంది. మరో 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఏప్రిల్ 28న నోటిఫికేషన్ జారీ అయింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్