అమెరికా కాల్పుల సంస్కృతి యూరప్ దేశాలకు పాకింది. తాజాగా, ఒక దుండగుడు.. డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ లో కాల్పులకు దిగాడు. కోపెన్ హెగెన్ ప్రాంతంలో సిటీ సెంటర్, విమానాశ్రయం ల మధ్య ఉన్న అమేగర్ జిల్లాలోని షాపింగ్ మాల్ లో ఆదివారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో.. ముగ్గురు ప్రాణాలు కొల్పోయారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొంత మంది అక్కడి నుంచి బయటవైపు పరుగులు పెట్టారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంకేవరైనా ఉన్నారా.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు.
ప్రశాంతంగా ఉండే డెన్మార్క్ లో కాల్పులు జరగటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 22 ఏళ్ళ యువకుడు మాల్ లోని వివిధ ప్రాంతాల్లో కాల్పులు చేస్తు తిరగటంతో డేనిష్ రాజధాని కోపెన్ హెగెన్ లో హై అలెర్ట్ ప్రకటించారు. కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
Also Read : నైజీరియా చర్చిలో కాల్పులు.. 50 మంది మృతి