దేశంలో వరుసగా రెండో రోజూ 21 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం 21,566 మందికి పాజిటివ్ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరింది. ఇందులో 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,930 మంది మృతిచెందగా, మరో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు 60 మంది బలవగా, 21,219 మంది డిశ్చార్జీ అయ్యారు.
ఇక కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతానికి పెరిగింది. మొత్తం కేసుల్లో 0.34 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.46 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 201.30 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.