Saturday, November 23, 2024
HomeTrending Newsమళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

మళ్లీ కొవిడ్‌ ప్రమాద ఘంటికలు

Corona Cases Increase By 41 Percentage In Bengal And Assam :

పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. వారపు పాజిటివిటీ రేటులోనూ పెరుగుదల నమోదవుతుండటంతో పాటు కరోనా పరీక్షలు తగ్గుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. కట్టుదిట్టంగా కొవిడ్‌ నిబంధనలను అమలు చేయాలని, కరోనా పరీక్షలు పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా  బెంగాల్‌, అస్సాం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. అస్సాంకు రాసిన లేఖలో.. అక్టోబరు 20-26 తేదీల మధ్య 41 శాతం కొవిడ్‌ కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. గత 4 వారాలుగా (ఈనెల 25 నాటికి) పాజిటివిటీ రేటు కూడా 1.89% నుంచి 2.22%కి పెరిగినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు.. సెప్టెంబరు 28 – అక్టోబరు 4 వారంలో 1,64,071 నిర్వహించగా ఆ సంఖ్య అక్టోబరు 19-25 వారానికి 1,27,048కి తగ్గిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. బెంగాల్‌లో గత వారం రోజుల్లో 41 శాతం కేసులు పెరిగినట్లు పేర్కొన్నారు. 4 వారాల్లో పాజిటివిటీ రేటు 1.93 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఇక్కడ కూడా కరోనా పరీక్షలు తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తగిన విధంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను నిర్వహించాలని.. వీటి పరిధిలో ఇంటింటికీ వెళ్లి కేసులను గుర్తించాలని స్పష్టం చేశారు

Must Read :పర్యాటకులకు అమెరికా అనుమతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్