Sunday, January 19, 2025
HomeUncategorizedకేరళలో విజృంభిస్తోన్న కరోనా కేసులు

కేరళలో విజృంభిస్తోన్న కరోనా కేసులు

కేరళలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎర్నాకుళం, తిరువునంతపురం, కొట్టాయం జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 4041 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే కేరళలో కొత్త ఇన్ఫెక్షన్ కేసుల్లో 9 శాతం పెరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 21 వేల పై చిలుకు యాక్టివ్ కేసులు ఉండగా పాజిటివిటి రేటు 0.95 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా వస్తుండగా కేవలం కేరళ నుంచే 34 శాతం కేసులు వస్తున్నాయి.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ తెలిపారు.కోవిడ్ పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి..ప్రస్తుతం రాష్ట్రంలో అంటువ్యాధుల సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ..ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యే జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి శాశ్వతంగా పోలేదని..ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్