Saturday, January 18, 2025
HomeTrending Newsఐఐటి చెన్నై క్యాంపస్ లో కరోనా కలకలం

ఐఐటి చెన్నై క్యాంపస్ లో కరోనా కలకలం

Iit Chennai Campus : చెన్నై ఐఐటిలో కరోనా కలకలం సృష్టించింది. ఒక్కరోజులోనే 31 కేసులు వెలుగు చూశాయి. 1121 మందికి పరీక్షలు చేయగా 31 మందికి పాజిటివ్ గా తేలింది. కేవలం ఐఐటి చెన్నై క్యాంపస్ లో మొత్తం మూడు వేల 79 మందికి పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 111 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. భారత్ లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు కొంచెం అటూ ఇటుగా 2 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4,49,197 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 2,483 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

దేశవ్యాప్తంగా ఇదే సమయంలో 1,970 మంది కరోనా నుంచి కోలుకోగా… 1,399 మంది మృతి చెందారు. కేరళ సహా పలు రాష్ట్రాలు మరణాలను సవరించిన నేపథ్యంలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. దేశంలో రోజు వారి  పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉండగా… రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మళ్లీ మాస్క్ లను తప్పనిసరి చేశాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్కరోజే 22.83 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. జూన్ మొదటి వారంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు కటినతరం చేయకపోతే మరోసారి కరోనా మహమ్మారి విస్తరణ ఎక్కువ అవుతుంది అంటున్నారు.

Also Read : మాస్కు ధ‌రించ‌క‌పోతే ఫైన్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్